Thursday, July 19, 2007

"నిన్నే కోరుకుంటా"

"రాత్రిలా-
నీ కౌగిట కరిగిపోవాలని....
కెరటంలా-
నిను తాకి తరలిపోవాలని....
గువ్వలా-
నీ గుండె గుడిలొ ఒదిగిపోవాలని....
నవ్వులా-
నీ అధరాలపై నిలిచిపోవాలని....
చినుకులా-
నీ చెక్కిట ముద్దు పెట్టాలని....
నీ వాకిట వీస్తున్న చిరుగాలిలా
నిన్నె కోరుకుంటున్న నా (ప్రతి) శ్వాసలా!!"

Monday, April 30, 2007

సినివాలి అనగ?

సినివాలి అనగ- లక్ష్మి సహస్రనామాలలోని లక్ష్మి దేవికి మరొ పేరు!! శబ్ద రత్నాకరము-సినివాలి - చంద్ర కళ కాన వచ్చెడు అమావాస్య, పార్వతి. ఆరుద్ర తన చందో-బద్ధ తేటగీతి లొ, ఇట్లనెన్- ఈ "సినివాలి నర్థమ్ము జేసికొనుట కా పదమునకు నైఘంటి కార్థ మిత్తు; చంద్ర కళ కనబడు అమాస కిది పేరు, సర్వ మంగళ పార్వతీ సతికి నొప్పు."