Wednesday, November 19, 2014

యత్ర నార్యంతు పూజ్యంతే


అమ్మాయి అంటే అంత చులకనా?
ఏం చేసిన భరిస్తుంది గనకనా?
హింసించినా...దూషించినా..
తన మనసుని ...గాయపర్చినా...

అణువణువున నీకై ఆరాటం
తన బ్రతుకే నిత్య పోరాటం
యత్ర నార్యంతు పూజ్యంతే..రమంతే తత్ర దేవతా...
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:

అడుగడుగునా అవమానించినా
తన గౌరవాన్ని నువ్వ్ మంటగల్పినా
వేదించినా.....విసిగంచినా..
నయవంచన...దగా జేసినా...

పడి లేచే కెరటం తన నైజం
దైన్యం కాదది సడలని ధైర్యం...
యా దేవి సర్వ భుతేషు: శక్తి రూపేణ సంస్థితా...

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:
తన బాల్యాన్ని చిదిమేసినా...
తన యౌవ్వన్నాన్ని కాలా రాసినా...
తన ప్రాణం కన్నా మిన్నగా
ప్రేమించే నిన్ను నిన్నుగా
జీవం పొసే ఓ తల్లిగా
లోకంలో కల్పవల్లిగా

వెలిగే జగతికి జనని నారీమణి
అర్ధిస్తోంది......బ్రతకనివ్వమని....
యా దేవి సర్వ భుతేషు: మాతృ రూపేణ సంస్థితా...
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ: