Tuesday, January 27, 2009

యువతరం


"మేల్కొల్పి జగాన్ని
నిద్రించే యువతరాన్ని
వదిలేసి సుఖాన్ని
నడిపించగ నవతరాన్ని
ఉద్యమించు సోదరా దెశ ప్రగతికి
కదలిరా సోదరి నిర్మిద్దాం నవ భారతవని!
కదలిర సహొదరి నిర్మిద్దాం నవ భారతవని!!"

Sunday, July 27, 2008

కోరిక

"చిటపటమని చిటపటమని కురిసే చినుకు
సన్నగా మొదలైంది నా పెదవుల వణుకు
నీ నగుమోము దొచింది కన్నుల కునుకు
అరవిందాలకె కలుగదా నీవంటే కినుకు
చేయాలని ఉంది యెదైన నీ కొరకు
నడవాలని ఉంది నీతొనే కడవరకు"

Thursday, July 19, 2007

"నిన్నే కోరుకుంటా"

"రాత్రిలా-
నీ కౌగిట కరిగిపోవాలని....
కెరటంలా-
నిను తాకి తరలిపోవాలని....
గువ్వలా-
నీ గుండె గుడిలొ ఒదిగిపోవాలని....
నవ్వులా-
నీ అధరాలపై నిలిచిపోవాలని....
చినుకులా-
నీ చెక్కిట ముద్దు పెట్టాలని....
నీ వాకిట వీస్తున్న చిరుగాలిలా
నిన్నె కోరుకుంటున్న నా (ప్రతి) శ్వాసలా!!"

Monday, April 30, 2007

సినివాలి అనగ?

సినివాలి అనగ- లక్ష్మి సహస్రనామాలలోని లక్ష్మి దేవికి మరొ పేరు!!

శబ్ద రత్నాకరము-సినీ వాలి - చంద్ర కళ కాన వచ్చెడు అమావాస్య, పార్వతి.

ఆరుద్ర తన చందో-బద్ధ తేటగీతి లొ,
ఇట్లనెన్-



ఈ 'సినీ వాలీ నర్థమ్ము జేసికొనుట
కా పదమునకు నైఘంటి కార్థ మిత్తు;
చంద్ర కళ కనబడు అమాస కిది పేరు,
సర్వ మంగళ పార్వతీ సతికి నొప్పు.