Friday, May 13, 2005

యాచన


కవిత్వం పెల్లుబికి రావాలంటే
ఏదో ఒక భావన ఉండి తీరాలి
ప్రేమో - విరహమో
సంతోషమో - విషాదమో
ప్రణయమో - ప్రళయమో !

కానీ, ఏ భావము లేక స్తంభించిపోయిన నా కలం ఏ కవిత రాయగలదు?
స్పందించడమే మరిచిన నా మనస్సు ఏ గీతిక పాడగలదు?

పగిలిన అద్దాన్ని అతికించగలమా?
పోయిన జీవాన్ని తిరిగి తేగలమా?
కాలన్ని వెనక్కి మళ్ళించగల శక్తి మనలో ఉందా?
ఇవేవి మనకు చేతకాదు కదా...
మరి చిధ్రమైన మనసుని ఎందుకు ప్రేమ పేరుతో పునరుజ్జీవింపజేయాలనుకొవటం?
అది అవివేకమే కాదు...ఆత్మవంచన కూడా!!

ఇది అర్ధమయ్యింది కాబట్టే...
జీవితమను నాటక రంగాన అడుగడుగునా ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ
ఊరికి ఉత్తరాన ఉన్నా నా శయనమందిరం వైపు నడిచుకుంటు వెళ్తున్నా....

నన్ను తన బిగికౌగిట బంధించి సేదతీర్చమని మృత్యువు ముంగిట నిలబడి చేతులు చాచి యాచిస్తున్నా!!

No comments: