"రాత్రిలా-
నీ కౌగిట కరిగిపోవాలని....
కెరటంలా-
నిను తాకి తరలిపోవాలని....
గువ్వలా-
నీ గుండె గుడిలొ ఒదిగిపోవాలని....
నవ్వులా-
నీ అధరాలపై నిలిచిపోవాలని....
చినుకులా-
నీ చెక్కిట ముద్దు పెట్టాలని....
నీ వాకిట వీస్తున్న చిరుగాలిలా
నిన్నె కోరుకుంటున్న నా (ప్రతి) శ్వాసలా!!"
Thursday, July 19, 2007
Monday, April 30, 2007
సినివాలి అనగ?
సినివాలి అనగ- లక్ష్మి సహస్రనామాలలోని లక్ష్మి దేవికి మరొ పేరు!!
శబ్ద రత్నాకరము-సినివాలి - చంద్ర కళ కాన వచ్చెడు అమావాస్య, పార్వతి.
ఆరుద్ర తన చందో-బద్ధ తేటగీతి లొ,
ఇట్లనెన్-
ఈ "సినివాలి నర్థమ్ము జేసికొనుట
కా పదమునకు నైఘంటి కార్థ మిత్తు;
చంద్ర కళ కనబడు అమాస కిది పేరు,
సర్వ మంగళ పార్వతీ సతికి నొప్పు."
Friday, May 13, 2005
యాచన
కవిత్వం పెల్లుబికి రావాలంటే
ఏదో ఒక భావన ఉండి తీరాలి
ప్రేమో - విరహమో
సంతోషమో - విషాదమో
ప్రణయమో - ప్రళయమో !
కానీ, ఏ భావము లేక స్తంభించిపోయిన నా కలం ఏ కవిత రాయగలదు?
స్పందించడమే మరిచిన నా మనస్సు ఏ గీతిక పాడగలదు?
పగిలిన అద్దాన్ని అతికించగలమా?
పోయిన జీవాన్ని తిరిగి తేగలమా?
కాలన్ని వెనక్కి మళ్ళించగల శక్తి మనలో ఉందా?
ఇవేవి మనకు చేతకాదు కదా...
మరి చిధ్రమైన మనసుని ఎందుకు ప్రేమ పేరుతో
పునరుజ్జీవింపజేయాలనుకొవటం?
అది అవివేకమే కాదు...ఆత్మవంచన కూడా!!
ఇది అర్ధమయ్యింది కాబట్టే...
జీవితమను నాటక రంగాన అడుగడుగునా
ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ
ఊరికి ఉత్తరాన ఉన్నా నా శయనమందిరం వైపు
నడిచుకుంటు వెళ్తున్నా....
నన్ను తన బిగికౌగిట బంధించి సేదతీర్చమని
మృత్యువు ముంగిట నిలబడి చేతులు చాచి యాచిస్తున్నా!!
Monday, September 13, 2004
నెలవంక
నీలి మబ్బుల మాటున దాగిన ఓ "నెలవంక"
నిన్ను చూచేందుకు నా కన్నులు తపిస్తున్నాయి
నీటిలొ బుడగలా
తొలకరి వాన చినుకులా
అపుడపుడు నీవు నాతో దోబూచులాడుతూ...
మసక మసకగా కనిపించి నన్ను మత్తెక్కిస్తుంటే...
గాలివానలా మొదలైన నా మదిలోని అలజడి
తూఫానులా మారి విజృంభించకముందే..
ఇపుడిపుడే విరియబూయుచున్న కుసుమంలా
నాకు దరిశెనమివ్వవా నా ప్రియసఖి!
నీ సుందర రూపమే నాకు శక్తినిచ్చే సాధనం
నీతో చెలిమే నా జీవనానికి ఇంధనం
ఎన్నాళ్ళైన నిరీక్షిస్తాను నీ కోసం!
తారలను వదిలి రాగలవా నీవు నా కోసం?
ప్రాణాలైనా అర్పించగలను నేను నీ కోసం!
అందించగలవా జీవితాంతం నాకు నీ స్నేహం?
ఏది ఎమైనా, ఎవరు ఏమన్నా,
ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని అపజయాలు ఎదురైనా...
నీ కోసమే నేనున్నది!
నీవాణ్ణి కావాలనే నేను కోరుకున్నది!!
నీ సంతోషమే నాకు ముఖం...
నీ చిరునవ్వే నాకు సర్వం!
ఇదే నేను నీతో ఎన్నాళ్ళుగానొ చెప్పాలనుకున్నది!
నన్ను ప్రేమిస్తున్నావన్న నీ నోట నే వినాలనుకున్నది!!
Wednesday, April 7, 2004
నువ్వు వస్తావని
నీతో నాకున్న అనుబంధం ఏమిటో గాని...
అన్ని బాంధవ్యాలు మరిచిపోతాను!
ఏడారిలో కాలిపోతున్న ఇసుక రేణువునైన నేను...
నీ చూపుల వర్షంలో తడిసి కరిగిపోతాను!!
కారు చీకట్లు కమ్మిన నా జీవితపు లోగిలిలోన...
మిరుమిట్లు గొలిపే నీ రాకతో మైమరచిపొతాను!!!
మూగబోయిన నా మదివీణను శ్రుతి చేసి...
రాగరంజితమైన సుస్వరాలు పలికించే నీ స్పర్శతో పులకరించిపోతాను!!!
నీవు నాకోసం కనీసం ఒకసారి కూడ రాలేవు అని తెలిసినా...వెర్రిగా
"నువ్వు వస్తావని" నీకోసం నిరీక్షిస్తూనే ఉండిపోతాను
ప్రియతమా,
నా ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే నీకు, నేను...
మనస్స్పూర్తిగా చేసుకునే విన్నపం ఒక్కటే ...!
నా శ్వాస ఆగిపోయేంతవరకు నీవు నా తోడుండూ..
లేదా,
నా శ్వాస ఆగిపోబోయే క్షణం ముందు నన్ను నీ ఒడిచేర్చుకొ !!!
Subscribe to:
Posts (Atom)
